📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న డాక్టర్ మల్లాది ప్రసాదరావు

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న డాక్టర్ మల్లాది ప్రసాదరావు

📰 Generate e-Paper Clip

యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూర్ సెప్టెంబర్గా 23 ప్రజావాణి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని పి.ఎస్. ఫంక్షన్ హాల్లో భారత్ రక్తదాన్ సేవా మిషన్ కే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు చెందిన రక్తదాతలు, సామాజిక సేవకులు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 320 సార్లు రక్తదానం చేసిన సంపత్ కుమార్ పాల్గొన్నారు. భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కురిమేటి నవీన్ చేతుల మీదుగా ప్రముఖ జర్నలిస్ట్ మరియు మదర్ సర్వీస్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మల్లాది ప్రసాదరావుకు ఉత్తమ సేవా పురస్కారం–2026 అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ, మదర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా దాతల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత మెడికల్ వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, నిరాశ్రయులైన వృద్ధులు, వితంతువులకు వస్త్రదానం, వృద్ధాశ్రమాల్లో అన్నదానం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసి ప్రజలకు రక్షణ కల్పించామని తెలిపారు. సమాజంలో నిస్వార్థంగా, స్వచ్ఛందంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులు, సామాజిక కార్యకర్తలను ప్రోత్సహిస్తూ మదర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారుగా 800 మందికి పైగా అవార్డులు ప్రధానం చేసినట్లు వెల్లడించారు.అనేక సేవా కార్యక్రమాలతో పాటు నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం అందించడం వంటి పలు సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని డాక్టర్ మల్లాది ప్రసాదరావు పేర్కొన్నారు.ప్రజలకు, నిరుపేదలకు, అవసరంలో ఉన్న వారికి అందిస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ సేవా పురస్కారంతో సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభించడం మరింత సేవాస్ఫూర్తితో ముందుకు సాగేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డాక్టర్ మల్లాది ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రాణం కూడా రక్తం అందక కోల్పోకుండా యువత ముందుకు వచ్చి రక్తదాతలుగా మారాలని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు.సమాజ సేవ అనేది కేవలం కార్యక్రమాలకు పరిమితం కాకుండా, అవసరంలో ఉన్న సమయంలో ఒక మనిషికి మరో మనిషి అండగా నిలవడమే నిజమైన సేవ అని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా మరింత సేవాస్ఫూర్తితో ప్రజలకు, నిరుపేదలకు, అవసరంలో ఉన్న వారికి తన సేవలను కొనసాగిస్తానని డాక్టర్ మల్లాది ప్రసాదరావు తెలిపారు. అవార్డుతుకున్న సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థలు,జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు తదితరులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.