📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవరద పరిస్థితులపై పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వరద పరిస్థితులపై పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

*వరద పరిస్థితులపై పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు…..!

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు, కాలువలు తదితర ప్రాంతాల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, పరిస్థితిని బట్టి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్న వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, నదులను దాటేందుకు ప్రజలు ప్రయత్నించ రాదని కలెక్టర్ సూచించారు. వరద నీటిలో వాహనాలతో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, నీట మునిగిన ప్రాంతాలు తదితర ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో రాకపోకలను పర్యవేక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, నీటిపారుదల, వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు వరదలకు సంబంధించిన ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
కంట్రోల్ రూమ్‌కు అందిన సమాచారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్: 1077, కంట్రోల్ రూమ్ సెల్ నంబర్: 9063211298 ప్రజలు ఈ నంబర్లను వినియోగించుకొని వరద పరిస్థితులు, అత్యవసర సమస్యలపై సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల వ్యాప్తంగా ఉదయం నుండి వర్షాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వ గణాంకాలలో వర్షం లేనట్టుగా ధ్రువీకరించడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.