*అరుంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…*
*హాజరైన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భాస్కర్ రావు.*
*సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పూరపాలక సంఘం పరిధిలోని స్థానిక ఇందిరానగర్ లోని అరుంధతి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వ హించిన గణపతి హోమం , విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ కలెక్టరు భాస్కర్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణ నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో , ఆయు రారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం యూత్ నిర్వాహకులు యూత్ సభ్యులతో కలిసి కార్య క్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అరుంధతి యూత్ సభ్యులు , మాజీ మునిసిపాలిటీ చైర్మన్ బర్రె జహంగీర్ , బండారు రవి వర్ధన్ , కౌన్సిలర్లు బర్రె పూజిత , జాలిగం విఘ్నేష్ , యూత్ కోశాధికారి నవీన్ , భరత్ , దర్శన్ , ఈశ్వర్ బాబు , నరేందర్ , బాబు , రాము స్థానిక ప్రజలు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అరుంధతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
RELATED ARTICLES

