📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriస్వయంభు బాలాజీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ సిరిసిల్ల రాజయ్య

స్వయంభు బాలాజీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ సిరిసిల్ల రాజయ్య

📰 Generate e-Paper Clip

పోచారం, ఆగస్టు 21 (ప్రజావాణి): వెంకటపురం గ్రామంలోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ స్వయంభు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ సిరిసిల్ల రాజయ్య, పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రే రాజేశ్ దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా దేవస్థానంలో త్వరలో నిర్వహించనున్న మహాకుంభాభిషేక కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న పూజా కార్యక్రమాలు, ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం నూతన పాలక మండలి కమిటీ చైర్మన్ నీరుడి కుమార్‌ను డాక్టర్ సిరిసిల్ల రాజయ్య అభినందించారు.

దేవస్థానం ప్రాచీన చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకున్న డాక్టర్ సిరిసిల్ల రాజయ్య ఆలయ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ నూతన పాలక మండలి సభ్యులు చి. కృష్ణ, రాయబండి అరుణ్ తేజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గణేష్ యాదవ్, బద్దం నర్సింహారెడ్డి, బద్దం మల్లికార్జున్ రెడ్డి, చింతపంటి సత్తయ్య, భోజిరెడ్డి, వినోద్ కుమార్, చంద్రకాంత్, వెంకటేష్, సంతోష్, ఆంజనేయులు గౌడ్, సురేష్, వేణుగోపాల్, నాగరాజు గౌడ్, రమేష్, లక్ష్మి, పావని, అందే పోచయ్య, బాలరాజ్ గౌడ్, నీరుడు సాయి తదితర నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.