📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘనంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామ్మోహన్ జన్మదిన వేడుకలు

ఘనంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామ్మోహన్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 21 (ప్రజావాణి): ఘట్‌కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామ్మోహన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మారం లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సమాజ సేవలో ముందుండే వారిని ప్రోత్సహించడం, అభినందించడం తమ క్లబ్ ప్రధాన లక్ష్యాలలో ఒకటని తెలిపారు. మారం లక్ష్మారెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన నాయకత్వంలో తెలంగాణ జన సమితి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ గుప్తా, చందుపట్ల లక్ష్మారెడ్డి, అల్లు కమలాకర్, నాగిళ్ల నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.