స్వయంభు బాలాజీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ సిరిసిల్ల రాజయ్య

పోచారం, ఆగస్టు 21 (ప్రజావాణి): వెంకటపురం గ్రామంలోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీ స్వయంభు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ సిరిసిల్ల రాజయ్య, పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రే రాజేశ్ దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవస్థానంలో త్వరలో నిర్వహించనున్న మహాకుంభాభిషేక కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న పూజా కార్యక్రమాలు, ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం నూతన పాలక మండలి కమిటీ చైర్మన్ నీరుడి కుమార్‌ను డాక్టర్ సిరిసిల్ల రాజయ్య...