నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన బిఆర్ ఎస్ మండల మైనారిటీ సెల్ అద్యక్షుడు ఎం డి సలీం గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఆయన మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు అన్నారు. ఆయన మృత దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బి ఆర్ ఎస్ కార్యకర్తల ద్వారా సేకరించిన రూ.130000 (లక్ష ముప్పై వేలు) వారి కుటుంబ సభ్యులకు ప్రకటన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని ఆదుకుంటుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పోగుల వెంకట్ రెడ్డి, కడారి శ్రీశైలం, నక్క చంద్రశేఖర్, ఈటెం వెంకట్ రెడ్డి, పూదరి సాయిదులు, భాసిపాక రాములు, రామావత్ శంకర నాయక్, మూడవ లక్ష్మణ్ నాయక్ ఉన్నారు.

