📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadఅబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్.

అబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్.

📰 Generate e-Paper Clip

అబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అబ్దుల్లా భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే,బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం అబ్దుల్లా నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా అబ్దుల్లాను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యు లకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అబ్దుల్లా కుటుంబ సభ్యు లను ఓదార్చారు.ఈ పరమర్శలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కోటగిరి పోతంగల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోరే కిషన్,తేల్ల రవి,సూదం నవీన్, హారిఫ్,సయ్యద్ ఏజాజ్,కప్ప సంతోష్,సయ్యద్ సాయబలి, సయ్యద్ మాజిద్,జల్లాపల్లి ఫారం నాయకులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.