📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 15: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి భావాలను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి బచ్చు నగేష్ గుప్త, చార్టర్డ్ లయన్ శ్రీనివాస్ గౌడ్, బచ్చు ప్రమోద్, లంబ సత్యనారాయణ, నాగిళ్ల నరసింగ్ రావు, భోగ లక్ష్మి, ఉడుత హిమబిందు, కమలాకర్, రామ్మోహన్, చందుపట్ల లక్ష్మారెడ్డి, రవి శంకర్, బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.