ఆర్ ఎన్ ఎస్ కాలనీ ఫేజ్-3లో ఘనంగా కమ్యూనిటీ భవన్ ప్రారంభోత్సవం
పాల్గొన్న మాజీ మేయర్, కార్పొరేటర్లు,నాయకులు, కాలనీ వాసులు
మేడిపల్లి ఆగస్టు 16( మన ప్రజావాణి) ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పేర్కొన్నారు.ఆర్ ఎన్ ఎస్ కాలనీ ఫేజ్-3లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవన్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈకార్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్,మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,మాజీ కార్పొరేటర్లు పోగుల నర్సింహ్మారెడ్డి,బోమ్మక్ కళ్యాణ్ కుమార్,రాసాల వెంకటేష్ యాదవ్, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని కాలనీ వాసులతో కలిసి కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించి,మొక్కల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించాల్సిన అవశ్యకతపై అవగాహన కల్పించారు.అనంతరం కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ కమ్యూనిటీ భవన్ కాలనీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా సామాజిక,సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.కాలనీ అభివృద్ధి,ప్రజా సంక్షేమం కోసం అందరి సహకారంతో నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దానగళ్ల యాదగిరి, యువజన నాయకులు ప్రశాంత్, రాము,ఆర్ ఎన్ ఎస్ కాలనీ ఫేజ్-3 అధ్యక్షుడు అజిత్ నాయర్,వెంకట్ రావు,వెంకట రమణ, రవీంద్ర బాబు,నరేష్ కుమార్,ప్రవీణ్ రెడ్డి,పవన్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, కాలనీ ప్రతినిధులు, మహిళా సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


