📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaతెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతికి చోటు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతికి చోటు

📰 Generate e-Paper Clip

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివశ్రీ సదానిరంజన్ సిద్ధాంతికి చోటు

నందకిషోర్,హీరో విశ్వదేవ్ రాచకొండ చేతుల మీదుగా ఘన సన్మానం

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన శ్రీ పశుపతినాథ దేవస్థానం అర్చక పురోహితులు,తెలంగాణ వీరశైవ జంగమ డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొని గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు నందకిషోర్,హీరో విశ్వదేవ్ రాచకొండ చేతుల మీదుగా ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలంగాణ సరస్వత పరిషత్‌లో కళానిలయం కల్చరల్,సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుళ నృత్య ప్రదర్శన దేశభక్తి కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది.కళానిలయం కల్చరల్ & సోషల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎ.సురేందర్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి,జాతీయ ఐక్యత, దేశభక్తిని ప్రతిబింబించేలా వివిధ నృత్య రూపాలను కళాకారులు ప్రదర్శించారు.మొత్తం 80 మంది నృత్యకారులు 80 నిమిషాల పాటు నిరంతరంగా కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం,పెరిణి, వెస్ట్రన్,సెమీ క్లాసికల్, దేశభక్తి నృత్యాలు, బోనాలు,బతుకమ్మ, కోలాటం,దండియా తదితర నృత్య రూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.భిన్న నృత్య సంప్రదాయాలను ఒకే వేదికపై సమన్వయం చేస్తూ భారతీయ సంస్కృతిలోని వైవిధ్యం, తెలంగాణ సాంస్కృతిక వైభవం, జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను చాటడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ విశిష్ట కార్యక్రమంలో శ్రీ పశుపతినాథ దేవస్థానం అర్చక పురోహితులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి కూడా పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడంలో భాగస్వామ్యమయ్యారు.ఆయన పాల్గొనడాన్ని గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.అనంతరం ప్రముఖ సినీ దర్శకులు నందకిషోర్, హీరో విశ్వదేవ్ రాచకొండ చేతుల మీదుగా సదా నిరంజన్ సిద్ధాంతిని ఘనంగా సన్మానించారు. “బహుళ దేశభక్తి కార్యక్రమం”పేరుతో ఆగస్టు 16-2026న ఈ రికార్డును నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు,రికార్డ్స్ హోల్డర్లు, న్యాయ సలహాదారుల సమక్షంలో కార్యక్రమాన్ని పరిశీలించి రికార్డు ధ్రువీకరణ ప్రక్రియను నిర్వహించారు.తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు,చైర్మన్ డా.చింతపట్ల వెంకటాచారి, అంతర్జాతీయ రికార్డ్స్ జ్యూరీ సభ్యులు శ్రీమతి రాధిక మంగిపూడి, ఇతర జ్యూరీ సభ్యులు, నిర్వాహకులు కార్యక్రమాన్ని అభినందించారు.80 మంది కళాకారులు 80 నిమిషాల పాటు విభిన్న నృత్య రూపాలను ప్రదర్శించడం ప్రత్యేకమైన రికార్డుగా నిలిచిందని వారు పేర్కొన్నారు.దేశభక్తి భావనను కళల ద్వారా చాటిన కార్యక్రమం ఈ సందర్భంగా శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి,సనాతన సంప్రదాయాలు,కళారూపాలను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశభక్తి భావనను కళల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు.భారతదేశంలోని విభిన్న కళారూపాలను ఒకే వేదికపై ప్రదర్శించడం ద్వారా భారతీయ సంస్కృతిలోని గొప్పతనం, ఐక్యతను చాటారని అన్నారు.ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు, కళల గొప్పతనాన్ని పరిచయం చేయడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు.వల్భాపూర్ గ్రామానికి చెందిన సదానిరంజన్ సిద్ధాంతి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం పట్ల గ్రామస్థులు,భక్తులు,అర్చక పురోహితులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల చేతుల మీదుగా సన్మానం పొందడం ఆయనకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.భారతీయ కళా వైవిధ్యం,తెలంగాణ సాంస్కృతిక వైభవం, దేశభక్తి భావనలను ఒకే వేదికపై ఆవిష్కరించిన ఈ బహుళ నృత్య ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావడం కళాకారులు, నిర్వాహకులకు చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.