📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళల పెట్రోల్‌ నిరసన భూవివాదం పరిష్కరించాలని డిమాండ్‌.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళల పెట్రోల్‌ నిరసన భూవివాదం పరిష్కరించాలని డిమాండ్‌.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత మహిళ అందె లక్ష్మి, ఆమె కుమార్తె భూవివాదం విషయంలో తీవ్ర ఆందోళనకు దిగారు. తమ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత వ్యవహారంలో ఇరువర్గాల నుంచి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.తమకు న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు, అధికారులు వెంటనే అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తమ భూ సమస్యను పరిష్కరించి, న్యాయం చేయాలని అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.