📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ హనూమత్ సమేత ధ్వజ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం.

ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మణ హనూమత్ సమేత ధ్వజ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం.

📰 Generate e-Paper Clip

 

బద్వేల్ నియోజకవర్గము,(ఆగస్టు 27 ప్రజావాణి -పోరుమామిళ్ల మండలము -పోరుమామిళ్ల టౌన్‌లోని  నగర్ వీధిలో శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ హనూమత్ సమేత ధ్వజ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 26,27,28 తేదీలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక వేడుకకు విశిష్ట అతిథిగా తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు  కుటుంబ సమేతంగా పోరుమామిళ్లకు విచ్చేసిన సందర్భంగా,శ్రీ జడబోలు బుచ్చయ్య,శ్రీమతి రంగమ్మ,శ్రీమతి & శ్రీ శ్రీరాములు, శ్రీ శ్రీరామ వంశీకృష్ణ గౌడ్,వారి కుటుంబ సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు,ప్రజలు, భక్తాదులతో కలిసి, సర్కిల్ వద్ద బద్వేల్ నియోజకవర్గ  అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి  పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దిల్ రాజు గారితో కలిసి దేవాలయ ప్రాంగణానికి చేరుకుని,అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అత్యంత భక్తిశ్రద్ధలతో,ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్న ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకంగా ఉందని శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, నిర్వాహకులకు, భక్తులకు, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.శ్రీ సీతారామ లక్ష్మణ హనూమత్ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.