ఘట్కేసర్, ఆగస్టు 18 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు మదనగిరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన వీరుడని, సామాన్యులు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. గోల్కొండ ప్రాంతంలోని జమీందారులు, పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాపన్న గౌడ్ వీరోచిత పోరాటం చేశారని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసి తన ధైర్యసాహసాలను చాటుకున్నారని గుర్తుచేశారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై గౌడ కులస్తుల ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించనున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. పాపన్న గౌడ్ చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, సహకార బ్యాంకు మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఘట్కేసర్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఆడా కమిటీ సభ్యుడు వేముల సంజీవ గౌడ్, బండారి ఆంజనేయులు గౌడ్, సింగిరెడ్డి రామిరెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, మారం లక్ష్మారెడ్డి, బచ్చు నాగేష్ గుప్తా, కృపానిధి, మేకల నరసింహారావు, బేతాళ నర్సింగరావు, పల్లె మధు గౌడ్, విజయ్ గౌడ్, ఓరుగంటి వెంకటేష్ గౌడ్, కొంతం అంజిరెడ్డి, మేకల దాస్, మీసాల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘం సలహాదారు బండారు శ్రీనివాస్ గౌడ్, సారా శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గౌడ్, డైరెక్టర్లు బండ్లగూడ కిషోర్ గౌడ్, బిగుడ పాండు గౌడ్, బండారి జగదీష్ గౌడ్, రాగిరి మల్లేష్, సరళ దేశం అండాలమ్మ, వెంకటరావు, అబ్బోల్ల వెంకటరావు, మెరుగు నరేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్‌తో పాటు సంఘం సభ్యులు, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


