ఘట్కేసర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
ఘట్కేసర్, ఆగస్టు 18 (ప్రజావాణి): ఘట్కేసర్ మున్సిపల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు మదనగిరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన...