📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గుర్రప్పగారిపల్లె ఎస్సీ మాదిగ ప్రజల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మార్పీఎస్, ఎమ్ఈఎఫ్ నాయకుల...

గుర్రప్పగారిపల్లె ఎస్సీ మాదిగ ప్రజల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మార్పీఎస్, ఎమ్ఈఎఫ్ నాయకుల డిమాండ్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల ఆగస్టు 3 ప్రజావాణి మండలం గుర్రప్పగారిపల్లె గ్రామంలోని ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న స్మశాన వాటిక సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మరియు ఎమ్ఈఎఫ్ సంఘాల నాయకులు, గ్రామస్తులతో కలిసి స్థానిక మండల తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఉద్యమ నాయకులు, సామాజిక కవి యంబడి ఈశ్వర్ మరియు ఎమ్మార్పీఎస్ మండల యువ నాయకుడు దాసరిపల్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.గుర్రప్పగారిపల్లె గ్రామంలోని ఎస్సీ మాదిగ ప్రజలకు చాలా కాలంగా స్మశాన వాటిక స్థలం లేకపోవడంతో, ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పేదల ప్రాథమిక హక్కు అయిన స్మశాన స్థలాన్ని వెంటనే కేటాయించి వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.అధికారుల సానుకూల స్పందన:వినతి పత్రం స్వీకరించిన మండల తహసీల్దార్ ఈ సమస్యపై తక్షణమే స్పందించారు.గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి,అర్హులైన ఎస్సీ మాదిగ ప్రజలకు తప్పకుండా స్మశాన వాటిక స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అక్కడికక్కడే స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్  మరియు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గుర్రప్పగారిపల్లె గ్రామ పెద్దలు, యువకులు మరియు దళిత సంఘాల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.