📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీర్కూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో 30 మందికి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

బీర్కూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో 30 మందికి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

📰 Generate e-Paper Clip

బీర్కూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో 30 మందికి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

జిల్లా పరిషత్ హై స్కూల్ లో 30 మంది విద్యార్థిని లకు HPV వ్యాక్సిన్‌ ప్రాముఖ్యతపై అవగాహన

బీర్కూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి బాపురెడ్డి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు నిండిన 30 మంది విద్యార్థులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేశారు.
హెచ్‌పీవీ వైరస్‌ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడంలో వ్యాక్సినేషన్‌ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యాధికారి విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు వ్యాక్సిన్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం అర్హులైన విద్యార్థులకు వైద్య సిబ్బంది టీకాలు అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం శివరాం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.