ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి.
మఠంపల్లి ఆగస్టు 9 (ప్రజావాణి)

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన గోపి రాములు (కొండా) అనే యువకుడు హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారం క్రితం మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్య నరసింహ (19) అతని స్నేహితుడు భోజ్య తండకు చెందిన గూగులోత్ గోపి రాములు (కొండ నాయక్) (21) ద్విచక్ర వాహనంపై కోదాడకు వెళ్ళి తిరిగివస్తున్న క్రమంలో చిలుకూరు మండలం సీతారామపురం గ్రామ శివారు కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి 167 పై ముందు ఉన్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నరసింహ అక్కడే మరణించగా, వెనుక కూర్చొని ఉన్న కొండా తీవ్రంగా గాయపడ్డారు. గుగులోతు గోపి రాములు (కొండా) పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారం నుంచి చికిత్స అందిస్తున్న ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఆదివారం గుగులోతు గోపి రాములు (కొండ) మృతి చెందాడు. కొండ మృతితో అతని కుటుంబంలో తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. చేతికి అంది వచ్చిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒకే ఒక్క కొడుకు లేకపోవడంతో వాళ్ళ దుఃఖానికి అవధుల్లేకుండా పోయాఇ. కొండ మరణంతో భోజ్య తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

