EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఉచిత నేత్ర వైద్య శిబిరం

ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఉచిత నేత్ర వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

 

 

 

*ఐ టెస్టులో పాల్గొన్న కృష్ణవేణి వికాస్ కళాశాల విద్యార్థులు*

 

*దృష్టి లోపాలను ముందే గుర్తించాలి*

 

*మొబైల్ వినియోగంతో కంటి సమస్యలు*

 

*కంటి ఆరోగ్యమే భవిష్యత్‌కు బలం*

 

*డిజిటల్ స్క్రీన్లను అతి తక్కువగా చూడాలి*

 

 

గోదావరిఖని జూలై 28 ప్రజావాణి :

విద్యార్థుల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మంగళవారం గోదావరిఖనిలోని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో ఉచిత నేత్ర పరీక్షా శిబిరం నిర్వహించారు. ఫ్రెండ్స్ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో, డాక్టర్ భవ్య ఐ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ప్రముఖ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ భవ్య విద్యార్థులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి సమస్యలను గుర్తించి అవసరమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ నేటి కాలంలో చిన్నారులు, విద్యార్థులు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు అధికంగా వినియోగించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, సరైన కంటి సంరక్షణ అలవాట్లతో అనేక సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఇలాంటి ఉచిత నేత్ర వైద్య శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో కంటి సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడం, సరైన కంటి సంరక్షణ పద్ధతులను వివరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. చదువుకునే వయస్సులో కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రౌతు గణేష్ కుమార్, కామెర శ్రీనిత్, కోలేటి విశాల్, మీస వికాస్, మర్కా అశ్రిత్. వసీం, అక్షయ్, కళాశాల చైర్మన్ డాక్టర్ నాగండ్ల జమున రవికుమార్, ప్రిన్సిపాల్ వెంకన్న, లెక్చరర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. మీసా వికాస్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు ముందు భవిష్యత్తు లో కంటి చూపు ఎంత ముఖ్యమో విద్యార్థులకి తెలియచేశారు ..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.