📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

కడప జిల్లా జూలై 06 ప్రజావాణి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కడప జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నగరం ఎర్రముక్కపల్లె సర్కిల్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వద్దకి ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించి అనంతరం గ్రీవెన్స్ లో డిఆర్ఓ గారికి వినతిపత్రం అందజేస్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు,జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు రాహుల్, అభినయ్.ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ.పెండింగ్లో ఉన్న 7 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని వాటిని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దుర్మార్గమని వారు అన్నారు.పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువును అభ్యసించేందుకు డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పీజీ కోర్సులకు చదువును అభ్యసించేందుకు ఎక్కువ శాతంగా ఉన్న కానీ ఫీజులు కట్టలేని పరిస్థితి.విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లిస్తామని అధికారంలోకి రావడం జరిగింది అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు కనీసం బకాయిలు కానీ,ఏదైతే పేద విద్యార్థులకు జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకపోవడం సిగ్గుచేటని వారన్నారు. అదేవిధంగా హాస్టల్స్ లో చదివే విద్యార్థులకు ధరలకు అనుగుణంగా 3000 రూపాయలు మెస్ చార్జీలు పెంచాలని అన్నారు. జిల్లాలో రాష్ట్రంలో వసతి గృహాలు సంత భవనాలు లేక బాడుగ వాటిల్లో గడుపుతూ ఉండడం దుర్మార్గం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సంత భవనాలు నిర్మించి నిధులు కేటాయించాలని వారి డిమాండ్ చేశారు. విద్యార్థులకు అడ్డంకుగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ ను కూడా రద్దుచేసి విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఇప్పటిదాకా ఏవైతే ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని సదుపాయాలు కల్పించి ఉపాధ్యాయుల కొరత తీర్చాలని,జిల్లాలో మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థల అధిక ఫీజు దోపిడిని అరికట్టాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హరిబాబు,నగర నాయకులు అఖిలేష్,నవీన్,కార్తీక్,దూద్ పీర్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.