📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు

మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు

📰 Generate e-Paper Clip

*మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు*

*రెండో రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి*

మేడ్చల్ జిల్లా: కీసర లో మహారాజ్ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కీసర డివిజన్ బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ కీసర గ్రామ శాఖ అధ్యక్షులు చినింగని బాలరాజు, మొరుగు మహేష్, గోరింటి ప్రవీణ్, మహేష్, తిరుమల్, తుడుం బాలకృష్ణ, ఉదయ్, రాజు రెబెల్, అఖిల్, యశ్వంత్, తుడుం సాయి తదితరులు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో కాలనీలో భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నవరాత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు మహారాజ్ యువసేన యూత్ అసోసియేషన్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రుల్లో ప్రతిరోజూ భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.