📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణBhadradri Kothagudemదక్షిణ అయోధ్య భద్రాచలం టూరిజంలో సరికొత్త ఆకర్షణ

దక్షిణ అయోధ్య భద్రాచలం టూరిజంలో సరికొత్త ఆకర్షణ

📰 Generate e-Paper Clip

*దక్షిణ అయోధ్య భద్రాచలం టూరిజంలో సరికొత్త ఆకర్షణ: “భద్రగిరి మార్ట్”!*

భద్రాచలం/మన ప్రజావాణి (16 సెప్టెంబర్ 26): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించడానికి భద్రగిరి మార్ట్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది. భద్రాచలం గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్న ఈ మార్ట్, స్థానిక గిరిజన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు, భద్రాచలం అడవుల నుండి సేకరించిన స్వచ్ఛమైన ఉత్పత్తుల కోసం ఈ మార్ట్‌ను సందర్శిస్తున్నారు. ప్రధానంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన చిరుధాన్యాలు, బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్డూలు, మహువా బర్ఫీ, అటవీ తేనె పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి స్థానిక గిరిజన జాతుల సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన సహజసిద్ధమైన నూనెలు, హస్తకళలు పర్యాటకులకు ప్రత్యేక జ్ఞాపకాలుగా మారుతున్నాయి. దూర ప్రాంతాల టూరిస్టుల కోసం భద్రగిరి మార్ట్ ఇప్పుడు అంతర్జాలం, వాట్సాప్ వ్యాపార ఖాతా ద్వారా ఆన్‌లైన్ ఆర్డర్లను కూడా స్వీకరిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.