📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్టీడీపీ సీనియర్ నాయకుడు మూడమల రమణా రెడ్డిపై జ‌రిగిన దాడిని ఖండిస్తూన,3 మండలాలకు చెందిన ముఖ్య...

టీడీపీ సీనియర్ నాయకుడు మూడమల రమణా రెడ్డిపై జ‌రిగిన దాడిని ఖండిస్తూన,3 మండలాలకు చెందిన ముఖ్య నాయకులు

📰 Generate e-Paper Clip

కాశినాయన జూలై 06 ప్రజావాణి నాయనపల్లి టీడీపీ సీనియర్ నాయకుడు మూడమల రమణా రెడ్డిపై జ‌రిగిన దాడిని ఖండిస్తూ కాశినాయన మండలం,కలసపాడు,పోరుమామిళ్ల మండలాలకు చెందిన ముఖ్య నాయకులు ఆయన నివాసానికి చేరుకుని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు అండగా ఉంటామ‌న్నారు.మీరు ఒంటరి కాదు.మీపై జరిగిన అన్యాయాన్ని పార్టీ శ్రేణులంతా తమపై జరిగిన దాడిగానే భావిస్తున్నాయని భరోసా ఇచ్చారు.న్యాయపరంగానూ,చట్టపరంగానూ చివరి వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ఈ ఘటనను ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి,సీఎం చంద్ర‌బాబు,లోకేష్,పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు శ్రీనివాస్ రావు,ఇన్‌ఛార్జి మంత్రి సవిత దృష్టికి,జోనల్ ఇన్‌ఛార్జి సహా పార్టీ ముఖ్య నాయకులందరి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు.మూడమల రమణా రెడ్డి దివంగత మాజీ మంత్రి వీరా రెడ్డి,కాలం నుంచే తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోసిన నిబద్ధత కలిగిన కార్యకర్త అని నాయకులు గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు,వేధింపులు,ఒత్తిళ్లు ఎదురైనా పార్టీని వీడకుండా,పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు.అలాంటి వ్యక్తి ఇంటి వద్దకే తెల్లవారుజామున రౌడీషీటర్లను సమీకరించి,మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పడం,మారణాయుధాలతో బెదిరించడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఒక్క రమణా రెడ్డిపై జరిగిన దాడి కాదు.పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్త మనోధైర్యంపై జరిగిన దాడియ‌ని వ్యాఖ్యానించారు.2024 ఎన్నికలతో గొడ్డలి పార్టీ బెదిరింపు రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పడిందని అందరూ భావించారు.కానీ గతంలో వైసీపీ కోసం పనిచేసిన కొందరిని టీడీపీలోకి తీసుకువచ్చి, మళ్లీ అదే బెదిరింపులు,దౌర్జన్యాలు,రౌడీయిజం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరమ‌ని అన్నారు.ఇంతవరకు బద్వేల్ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదని, రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ ఒక నాయకుడి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఇప్పటికే కడప ఎస్పీకి ఫిర్యాదు చేశామని,దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తకు అండగా నిలవడం తమ బాధ్యత అని,రమణా రెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నాయకులు మరోసారి భరోసా ఇచ్చారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.