📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పాడి రైతుల పిల్లలకు కరీంనగర్ పాల డెయిరీ స్కాలర్‌షిప్‌లు

పాడి రైతుల పిల్లలకు కరీంనగర్ పాల డెయిరీ స్కాలర్‌షిప్‌లు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 13 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన కరీంనగర్ పాల డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతుల కుటుంబాల విద్యార్థులకు కరీంనగర్ డైరీ చేర్మెన్ ఆదేశాల మేరకు  పాల స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించి ఉన్నత విద్యకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కరీంనగర్ పాల డెయిరీ సూపర్‌వైజర్ కేడిక మాధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పాడి రైతుల పిల్లలు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. డెయిరీ రైతుల సంక్షేమంతో పాటు వారి పిల్లల విద్యాభివృద్ధికి కూడా కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ పాల డెయిరీ మేనేజర్ సుధాకర్, సైట్ సూపర్‌వైజర్ ధన్‌రాజ్ పాల్గొని అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డెయిరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.