దూడను చూసేందుకు ఆసక్తిగా తరలివచ్చిన గ్రామస్తులు
బెజ్జంకి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని నర్సింహులపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు మోహన్ రావు పశువుకు శనివారం రెండు తలల దూడ జన్మించింది.వింతగా జన్మించిన దూడను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తిగా తరలివచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలాంటి దూడలు జన్మించే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

