📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriచౌదరిగూడలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

చౌదరిగూడలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూన్ 30: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పోచారం డివిజన్-8 పరిధిలోని చౌదరిగూడలో మంగళవారం ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) మంజులతో కలిసి యూత్ కాంగ్రెస్ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావడంతో పాటు, వివరాలను సరిచేసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఫారాలను పూర్తిగా నింపి నిర్ణీత గడువులోపు సమర్పించాలని ఓటర్లకు సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.