📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఆసుపత్రిలో కాంగ్రెస్ నేత కట్ట ఆంజనేయులు గౌడ్‌ను పరామర్శించిన వజ్రేష్ యాదవ్

ఆసుపత్రిలో కాంగ్రెస్ నేత కట్ట ఆంజనేయులు గౌడ్‌ను పరామర్శించిన వజ్రేష్ యాదవ్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 18 :  పోచారం డివిజన్ చౌదరిగుడ లో గ్రామ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ్ ఇటీవల వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకుని రాయదుర్గంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్, ప్రముఖ నాయకుడు కె. వినోద్ కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైద్యులను కలిసి ఆంజనేయులు గౌడ్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ కుటుంబం ఎల్లప్పుడూ ఆయనకు అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేతలు భరోసా కల్పించారు. కట్ట ఆంజనేయులు గౌడ్ త్వరగా కోలుకుని మునుపటిలాగే ప్రజా సేవలో చురుకుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు కర్రె రాజేష్ తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.