📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

నాసిరకం తారు రోడ్డు నిర్మాణం – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం కలసపాడు మండలంలో రూ. 5.5 కోట్ల రోడ్డు నిర్మాణంలో ఘోర అవినీతి!

* లేని ‘సువార్త తండా’కు రోడ్డు సృష్టించి బిల్లుల స్వాహా?
* గత ప్రభుత్వ ఎమ్మెల్సీ బంధువుల కోసమే నిధుల మంజూరు?
* మట్టి పని లేదు.. మెటలింగ్ లేదు.. రైతుల ఆగ్రహం

కలసపాడు ప్రజావాణి (జూన్ 03) కలసపాడు మండలం ఈ.రామాపురం గ్రామంలో తారు రోడ్డు నిర్మాణం పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందని స్థానిక రైతులు,గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ.రామాపురం నుండి తంబళ్లపల్లి వయా సుగాలి తండా వరకు రూ. 5 కోట్ల 50 లక్షల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన తారు రోడ్డు పనులు అత్యంత నాసిరకంగా జరిగాయని ఆరోపిస్తున్నారు.
అసలు లేని తండాకు రోడ్డు ఎలా వేస్తారు? ఈ రోడ్డు నిర్మాణంలో అసలు దారుణం ఏమిటంటే.. క్షేత్రస్థాయిలో ‘సువార్త తండా’అనే ప్రాంతమే లేదు. కానీ, కాగితాల్లో ఆ తండా ఉన్నట్లు సృష్టించి రోడ్డును మంజూరు చేయించుకున్నారు.గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ ఎమ్మెల్సీ తన బంధువులకు, అనుకూలమైన కాంట్రాక్టర్లకు ఆర్థిక లాభం చేకూర్చడానికే ఈ నిధులు కేటాయించారని గ్రామస్థులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.నిబంధనలు గాల్లోకి.నాసిరకం పనులు:రోడ్డు నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదు.మట్టి పని మాయం లీడ్ దూరం (రవాణా ఖర్చులు) ఎక్కువగా చూపించి బిల్లులు క్లెయిమ్ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పక్కనే ఉన్న చేలల్లోని మట్టిని తీసి ఫిల్లింగ్ చేశారు. గుండ్రాళ్లతో హార్ట్ వర్క్:నిబంధనల ప్రకారం కాకుండా,లోకల్‌గా దొరికే గుండ్రాళ్లు, చిట్యంతో హార్ట్ వర్క్ పూర్తి కానిచ్చారు.మెటలింగ్ లేదు:రోడ్డుకు అవసరమైన మెటలింగ్ సరిగా చేయకుండానే నాసిరకం తారుతో మమ అనిపించారు.అధికారుల నిర్లక్ష్యం పనులు జరుగుతున్నప్పుడు అధికారుల పర్యవేక్షణ అస్సలు లేదు. కాంట్రాక్టర్లు చెప్పిందే వేదంగా అధికారులు వ్యవహరించారు.నరకప్రాయంగా మారిన ప్రయాణం రైతుల ఇబ్బందులు:సుగాలు తండా వరకు రోడ్డును పూర్తిగా వేయకుండా,మధ్యమధ్యలో ముక్కలు ముక్కలుగా వదిలేశారు. దీనివల్ల పొలాలకు వెళ్లే రైతులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చిన్నపాటి వర్షం వస్తే చాలు.రోడ్డంతా గుంతలమయమై చెరువును తలపిస్తోంది. ఈ సమస్యపై ఇప్పటికే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా,పట్టించుకునే నాథుడే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పూర్తి విచారణ జరపాలి రైతుల డిమాండ్:లేని తండా పేరు చెప్పి రోడ్డు వేయడంపై, నిధుల దుర్వినియోగంపై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే ఉన్నతాధికారులతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఈ.రామాపురం గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.నాసిరకం పనులకు కారణమైన కాంట్రాక్టర్లు,సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిధులు రికవరీ చేసి రోడ్డును సక్రమంగా నిర్మించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.