- రెండో స్థాయికి 15 మంది విద్యార్థులు అర్హత
కోదాడ, అక్టోబర్ 31/ప్రజావాణి : రామచంద్రాపురంలోని రామానుజన్ గణిత అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామానుజన్ గణిత ఒలంపియాడ్–2026లో జయ ఐఐటీ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాలకు చెందిన మొత్తం 15 మంది విద్యార్థులు రెండో స్థాయికి అర్హత సాధించినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు.తరగతుల వారీగా ఐదో తరగతి నుంచి ఇద్దరు, ఆరో తరగతి నుంచి ఒకరు, ఏడో తరగతి నుంచి ఇద్దరు, ఎనిమిదో తరగతి నుంచి ఇద్దరు, తొమ్మిదో తరగతి నుంచి ఐదుగురు, పదో తరగతి నుంచి ముగ్గురు విద్యార్థులు అర్హత సాధించారు.ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారికి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు అభినందించారు. విద్యార్థుల విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
రామానుజన్ గణిత ఒలంపియాడ్‌లో జయ విద్యార్థుల ప్రతిభ
RELATED ARTICLES

