📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyజోగిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

జోగిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

*జోగిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు*

మన సమగ్ర ప్రజావాణి జూన్ 02
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి


జోగిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పతాకావిష్కరణ అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడిన నాయకుల సేవలను స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.
వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు )మున్సిపల్ కమిషనర్ తిరుపతి, సురేందర్ గౌడ్, కౌన్సిలర్లు  ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.