బెజ్జంకి,జూన్ 16 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని విరాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రామంలోని అంగన్వాడీ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల విషయంలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని పంచాయతీ ప్రతినిధులు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుముల సతీష్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

