📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రజలకు హెచ్చరిక అప్రమత్తంగా ఉండండి

ప్రజలకు హెచ్చరిక అప్రమత్తంగా ఉండండి

📰 Generate e-Paper Clip

సత్యసాయి జిల్లా జూన్ 08 ప్రజావాణి కదిరి RTC బస్టాండ్‌లో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఒక గుర్తు తెలియని మహిళ, మరో మహిళా ప్రయాణికురాలికి వెనుక నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమె నగలు అపహరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.అయితే అక్కడ ఉన్న ప్రయాణికులు మరియు స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి, అనుమానిత మహిళను అక్కడికక్కడే నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు .అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించాము.ప్రజలకు విజ్ఞప్తి :ఒంటరిగా ప్రయాణించే మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. చిన్న పిల్లలపై ఎప్పుడూ నిఘా ఉంచండి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండండి.ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే సమీప పోలీసులకు లేదా భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వండి. అపరిచితులు ఇచ్చే ఆహారం, పానీయాలు లేదా ఇతర వస్తువులు స్వీకరించవద్దు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.