📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్స్నేహం అనేది రెండు హృదయాల మధ్య ఉండే ఒక అందమైన వారధి *పొదిలి జూనియర్ కాలేజ్...

స్నేహం అనేది రెండు హృదయాల మధ్య ఉండే ఒక అందమైన వారధి *పొదిలి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఉత్తమ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్న మిత్రులు

📰 Generate e-Paper Clip

పొదిలి జూన్ 08 ప్రజావాణి నేషనల్ బెస్ట్ ఫ్రెండ్స్ డే ( జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం) సందర్భముగా  జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నవ్వులు పువ్వులు సంఘం మిత్రుల ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఒకరికి ఒకరు ఘనంగా తెలుపుకున్నారుఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ మదార్ వలి మాట్లాడుతూ స్నేహం అనేది రెండు హృదయాల మధ్య ఉండే ఒక అందమైన వారధి అని, వందమంది స్నేహితులు ఉండటం కంటే 100 సమస్యలు తీర్చే ఒక మంచి మిత్రుడు ఉండటం గొప్ప అని, గొప్ప గొప్ప వాళ్ళు నా స్నేహితులు కావాలని కోరుకోకుండా నా స్నేహితులు అందరు గొప్పవాళ్లు కావాలని కోరుకోవాలని తెలిపారు సంఘంలో సీనియర్ సభ్యుడు అయిన గోవిందయ్య, మాట్లాడుతూ మంచి మిత్రులు అనేవారు అన్ని కులాలలో ఉంటారని,మా సంఘములో అన్ని కులాల మిత్రులు కలిసిమెలిసి ఉంటున్నామని, అన్ని విషయాలు ఒకరికి ఒకరు పంచుకొని కలసి మెలసి ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మదార్ వలి,బాషా మొహిద్దీన్,గోవిందయ్య, భుటో జిలాని,మీరావలి,ఇడ్లి జిలాని,సుబ్రహ్మణ్యం, టివి నారాయణ,పండు గౌస్,తోట శ్రీను, పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకొని మిఠాయిలు పంచుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.