EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం దేశానికే గర్వ కారణం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం దేశానికే గర్వ కారణం.

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల  మే 18 ప్రజావాణి,మహానాడు పై తీసుకున్న నిర్ణయం మరోసారి దేశానికి ఆదర్శంగా గర్వకారణంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చరిత్రలో నిలిచిపోయే విధంగా అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి యనమల సుధాకర్ కొనియాడారు. సోమవారం ఆయన తమ కార్యాలయంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎంతో ఉత్సాహంగా నిర్వహించే మహానాడు పండుగను దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్పందిస్తూ మహానాడు పండుగను పర్చువల్ పద్ధతిలో నిర్వహించాలనేది తీసుకున్న నిర్ణయం గొప్ప బాధ్యతాయుతమైనదిగా పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ లేని విధంగా ప్రజల ప్రయోజనాలను ముందుగానే ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా నిలిపిన నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం నిజంగా అభినందనీయమైనది. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మహానుడు అనేది భావోద్వేగపూరిత వేడుక అయినప్పటికీ దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు స్వాగతించి అభినందించాల్సిన అవసరం ఉంది. 2006 పర్చవల్ పద్ధతిలో మహానాడు నిర్వహణ రెండు రోజులపాటు నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ పొదుపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక స్టేజి ఏర్పాటు చేసి ఆన్లైన్లో మహానాడు నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా 1,845 కస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొనే విధంగా ఎన్టీఆర్ భవన్ నుంచి పాలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొనే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు సాంకేతికతను వినియోగిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగించే వినూత్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మరోసారి దేశానికే మార్గదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల సుధాకర్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.