📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetపౌష్టికాహారం ప్రతి మహిళకు అవసరం – అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలి సర్పంచ్ ఎర్రల...

పౌష్టికాహారం ప్రతి మహిళకు అవసరం – అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలి సర్పంచ్ ఎర్రల జానకి

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 2 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో రక్తహీనత, పోషకాహార లోపం నివారణే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా అందిస్తున్న వేడి భోజనం, పాలు, కోడిగుడ్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతినెల వైద్య శిబిరాలు నిర్వహిస్తూ మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని,
చిన్నారుల సమగ్ర ఎదుగుదలకు పౌష్టికాహారం అత్యంత అవసరమని, తల్లులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరవ్వ, అయా కనుకవ్వ, ఆశ వర్కర్ తృతీయ వర్ణ, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.