ఎన్టీఆర్ జిల్లా నందిగామ (మే21ప్రజావాణి) గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయి.అధికారులు అదృశ్యం కాగితాలకే పరిమితమైన ఎక్సైజ్ నిఘా.కాకి కాకి ముక్కు పొడవదు’.ఎక్సైజ్ శాఖ అవినీతి తిమింగలాలపై ‘ఏసీబీ’ ఉక్కుపాదం మోపాల్సిందే.ఎక్సైజ్ శాఖ రథసారథి ఉన్నారా? లేరా.సొంత శాఖ తనిఖీలు వద్దు, ఏసీబీ దాడులే ముద్దు.ప్రభుత్వ ధరలకు పాతర.లంచాల నెట్వర్క్తో ప్రజల ప్రాణాలతో చెలగాటం.సస్పెన్షన్ వేటు పడాలి.బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ మద్యం మాఫియాకు సహకరిస్తున్న అధికారులను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి, కఠిన చట్టాల కింద జైలుకు పంపాలి.కేవలం కుర్చీల్లో కూర్చుని సంతకాలు పెడితే బాధ్యత తీరిపోదు.క్షేత్రస్థాయిలో ప్రజల ప్రాణాలతో,యువత భవిష్యత్తు తో ఆడుకుంటున్న ఈ మద్యం అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టాలి. ఏసీబీ దాడులు జరిగితే తప్ప ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ శాఖలో పేరుకుపోయిన అవినీతి లీలలు, బెల్ట్ షాపుల అసలు భాగోతం బయట పడవు. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారో,లేదో చూడాలి.అధికారులను పర్యవేక్షించడంలో,అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రధాన అధికారి ఘోరంగా విఫలమయ్యా రనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్నతాధికారే ఉదాసీనంగా ఉంటే,కింద స్థాయి సిబ్బందికి ‘మామూళ్ల పండగే’కదా అని స్థానికులు మండిపడుతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులుఉన్నాయి.కానీ అధికారులు ఎక్కడ.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గల్లీలోనూ వెలిసిన బెల్ట్ షాపులను ఇనుప పాదంతో తొక్కేయా ల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులదే. ఇందుకోసం ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సాయుధ సిబ్బంది ఉన్నారు, ప్రభుత్వ వాహనాలూ ఉన్నాయి. కానీ,తీరా క్షేత్రస్థాయిలో చూస్తే బెల్ట్ షాపులు యథేచ్ఛగా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్నాయి.అధికారులు ఏ చల్లటి గదుల్లో దాక్కున్నారో,ఎవరి అండ చూసుకుని మిన్నకుండిపోయారో అర్థం కావడం లేదు.మద్యం వ్యాపారుల అక్రమ దందాకు ఎదురులేకుండా పోతుంటే,అధికారులు మాత్రం తాము విధి నిర్వహణ చేస్తున్నట్టు నటిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.అక్రమాలకు అండ.నిఘా విభాగం ఊసే లేదు.ఎక్సైజ్ శాఖ అధికారుల ఈ ఘోర మౌనం వెనుక ఉన్న ‘ఆర్థిక’ ఒప్పందాలు ఇప్పుడు బహిరంగ రహస్యమే.మరోవైపు.ఇటువంటి శాఖాగత అవినీతిని, అక్రమా లను నిరంతరం పర్యవేక్షించాల్సిన నిఘా (విజిలెన్స్) అధికారులు అసలు ఎన్టీఆర్ జిల్లా వైపే కన్నెత్తి చూడటం లేదు.వారి పర్యవేక్షణ లోపం వల్ల, బెల్ట్ షాపుల నిర్వాహకులకు ఇది సువర్ణ అవకాశంగా మారింది. అధికారుల కళ్ల ముందే అడ్డగోలుగా,నిర్ణీత ప్రభుత్వ ధరకంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నా, కనీసం ఒక్క కేసైనా నమోదు చేయక పోవడం వెనుక పెద్ద లంచాల నెట్ వర్కే నడుస్తోందని స్పష్టమవుతోంది.సొంత తనిఖీలు వద్దు.అవినీతి నిరోధక శాఖ’ (ఏసీబీ) దాడులే కావాలి.ఇకనైనా ఈ దందాకు,అవినీతి కూటమికి అడ్డు కట్ట పడాలంటే కేవలం ఎక్సైజ్ శాఖ అంతర్గత తనిఖీలు సరిపోవు. ఎందుకంటే ‘కాకి కాకి ముక్కు పొడవదు.అన్నచందంగా సొంత శాఖ అధికారులు ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.లంచగొండితనాన్ని మూలాల నుంచి పెకలించాలంటే స్వతంత్ర విభాగమైన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగాల్సిందే.ఆకస్మిక దాడులు జరగాలి.. ఎన్టీఆర్ జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్లపై,ఉన్నతాధికారుల కార్యా లయాలపై,వారి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు ఆకస్మిక దాడులు జరపాలి.మామూళ్ల చిట్టా బయటపడాలి.మద్యం సిండికేట్ల నుంచి అధికారులు వసూలు చేస్తున్న నెలవారీ ‘మామూళ్ల చిట్టాలను’ ఏసీబీ అధి కారులు నడిబజార్లో పెట్టాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కోణంలో విచారణ జరపాలి
నిద్రపోతున్న ఎక్సైజ్ శాఖ బాస్.పల్లె పల్లెనా అక్రమ మద్యం సామ్రాజ్యం.ఖాకీల ‘మామూళ్ల’ మైకం..మూడు పువ్వులు ఆరు కాయలుగా బెల్ట్ దందా.!
RELATED ARTICLES

