సర్దార్ పటేల్ ఉక్కు సంకల్ప ఫలితమే తెలంగాణ విమోచనం
నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన యోధుడు సర్దార్ పటేబీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రాల హంసకృష్ణ గౌడ్
మేడ్చల్సె సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కండ్లకోయలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రాల హంసకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పాలనలో కొనసాగిందన్నారు. నిజాం నవాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల దౌర్జన్యాలతో ప్రజలు నలిగిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు అప్పటి భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో చర్యలు చేపట్టారని తెలిపారు. 1948 సెప్టెంబర్‌లో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం నిజాం పాలన ముగిసి తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తుచేశారు.సర్దార్ పటేల్ చూపిన ధైర్యం, ఉక్కు సంకల్పం దేశ సమగ్రతకు బలమైన పునాది వేసిందని హంసకృష్ణ గౌడ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజలు ఆత్మగౌరవంతో జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కండ్లకోయలో పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, జిల్లా నాయకులు బి. మల్లేష్, వై. ప్రభాకర్, వై. రాకేష్, టి. వెంకటేష్, విక్రమ్ జైస్వాల్, మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కుమ్మరి మల్లేష్, పూజారి శ్రీనివాస్, వై. ప్రణయ్, లక్ష్మీనారాయణ, దానయ్యతో పాటు స్థానిక మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన యోధుడు సర్దార్ పటేల్ సముద్రాల హంసకృష్ణ గౌడ్
RELATED ARTICLES

