📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

📰 Generate e-Paper Clip

చాపాడు ప్రజావాణి న్యూస్ మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఎన్.ఒబాయ పల్లె సచివాలయం పరిధిలో ఎన్.అనంతపురం గ్రామంలో శనివారం జాతీయ డెంగ్యూ దినోత్సవం వైద్యాధికారి డాక్టర్ పి ఓబులేసు గారి ఆధ్వర్యంలో ర్యాలీ,సదస్సు, జరిపామని తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ పి ఓబులేసు మాట్లాడుతూ ఈ డెంగ్యూ వ్యాధి ఏడీస్ ఈజిప్ట్ అను దోమ వలన డెంగ్యూ జ్వరం వస్తుందని ఈ జ్వరం ఒకప్పుడు ప్రాణాంతకంగా మారవచ్చునని అక్కడి గ్రామ ప్రజలకు వివరించి చెప్పడం జరిగినది ఈ డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం మీయొక్క ఇండ్లలోని నీటినంత పారద్రోసి మరల నీరు పట్టుకోవడం వల్ల ఈ దోమలు నీటిలో గుడ్లు పెట్టకుండా అవి లార్వాగా మారకుండా ఆ లార్వా దోమలుగా అభివృద్ధి చెందకుండా ఉంటాయని కనుక గ్రామ ప్రజలంతా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే తప్పకుండా పాటించాలని ఇలా చేయడం వల్ల మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా, బోద కాలు, మెదడు వాపు వ్యాధి,వైరల్ ఫీవర్స్ లాంటివి జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చునని ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండాలని మీ ఇంటి చుట్టూ ప్రక్కల మరియు మీ పరిసరాల చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ వ్యాధి గురించి ర్యాలీ నిర్వహించడం మరియు సదస్సు,అక్కడి ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి యం. రాఘవయ్య, డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జయప్రకాష్,ఎ ఎన్ యం ఆరోగ్య మేరీ,ఆశా కార్యకర్త జయమ్మ,అంగన్వాడీ కార్యకర్త,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.