📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapet*69వ ఎస్జిఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలికల క్రికెట్ పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీ...

*69వ ఎస్జిఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలికల క్రికెట్ పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి ఎంపిక

📰 Generate e-Paper Clip

**69వ ఎస్జిఎఫ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలికల క్రికెట్   పోటీలకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి ఎంపిక*

కోదాడ ఏప్రిల్21(ప్రజావాణి )స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్జిఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ రాష్ట్ర స్థాయి  అండర్–14 క్రికెట్ బాలికల టోర్నమెంట్ రంగారెడ్డి జిల్లాలో లో గల జిఎన్ఆర్  క్రికెట్ గ్రౌండ్లో ఏప్రిల్ 23 తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన సోంపంగు వర్షిని ఎంపికైనట్లు కోచ్ సిద్ధిఖ్ తెలిపారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ సలీం షరీఫ్ క్రీడాకారులను అభినందించారు. కోదాడకు చెందిన క్రీడాకారీణి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.రాబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో  ఉత్తమ ప్రదర్శన చేసి జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు ఫిట్నెస్ పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని పేర్కొంటూ, వారు లక్ష్యాన్ని సాధించాలని మనసారా ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా  కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్ ,డాక్టర్ నందకిషోర్ , డాక్టర్ చైతన్య, డాక్టర్ దిలీప్, డాక్టర్ నరసింహారెడ్డి,సభ్యులు ఖాజా మియా, తుమ్మల సురేష్,మీరా , జబ్బార్, ఏడుకొండలు, అసోసియేషన్ సభ్యులు
బడుగుల సైదులు,నాయిని నాగేశ్వరరావు, శ్రీకాంత్,    బాలరాజు, బుల్లయ్య, శ్రీను   తదితరులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.విరితో పాటు తల్లిదండ్రులు  అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.