31వ వార్డులో నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తిప్పన విజయసింహారెడ్డి
నవంబర్ 1 (ప్రజావాణి): వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలోని 31వ వార్డులో ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు, కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో, 31వ వార్డు ఇన్చార్జి చలిగంటి వెంకట్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా నాయకులు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారుఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్, 16వ వార్డు ఇన్చార్జి కరీముల్లా బాబా, 35వ వార్డు ఇన్చార్జి బత్తుల ఉపేందర్, కందుల శ్రీకాంత్, పొదిల క్రాంతి, పిట్టల భాగ్యమ్మ, 12వ వార్డు ఇన్చార్జి రాజేష్, లాజర్, జానీ, సిద్ధు, రమేష్, బొల్లం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

