📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetరాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కోదాడ క్రీడాకారులు

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కోదాడ క్రీడాకారులు

📰 Generate e-Paper Clip

ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు షేక్ అర్హాన్, మరికంటి భువన్ సాయి ఎంపిక

కోదాడ, నవంబర్ 1 (ప్రజావాణి): రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు కోదాడకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్‌లో నవంబర్ 1 నుంచి నిర్వహించనున్న 70వ ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన షేక్ అర్హాన్, మరికంటి భువన్ సాయి స్థానం సంపాదించారు.మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి వీరిద్దరూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా అకాడమీ కోచ్ సిద్ధిఖ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి నాణ్యమైన శిక్షణ అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.మండల విద్యాశాఖ అధికారి ఎం.డి. సలీం షరీఫ్ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ ఎంపిక పట్ల కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి సురేష్, డాక్టర్ నందకిషోర్, ఖాజా మియా, తుమ్మల సురేష్, చందా శ్రీనివాస్, నాయిని నాగేశ్వరరావు, జబ్బార్, బుల్లయ్య, శ్రీకాంత్, శ్రీను తదితరులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.