📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టొద్దు,,తల్లిదండ్రులకు,జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్...

మైనర్లకు వాహనాలు ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టొద్దు,,తల్లిదండ్రులకు,జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్

📰 Generate e-Paper Clip

గుంటూరుజిల్లాపోలీస్ప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడానికి, గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ది.09.04.2026 తేదిన “ప్రత్యేక డ్రైవ్” నిర్వహించబడింది. ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకోబడినవి.జిల్లా వ్యాప్తంగా మొత్తం 842 ద్విచక్ర వాహనాలు స్వాధీనం, అందులో 206 వాహనాలు సీజ్, మిగతా 636 వాహనాలకు రూ.3,36,913/- జరిమానా విధించబడింది.ఈరోజు (10.04.2026) గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన “ప్రత్యేక డ్రైవ్ లో రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా పోలీస్ వారికి పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్ ” కార్యక్రమంలో పాల్గొని వాహనదారులకు, వారు తల్లిదండ్రులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనల గురించి పలు ఆదేశాలు, సూచనలు, హెచ్చరికలు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మోటార్ వాహనాల నిబంధనలు పాటించకుండా, వాటిని అతిక్రమిస్తున్న వారిని గుర్తించి, రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలను గురించి అందరికీ అవగాహన కల్పించాలని నిన్నటి రోజున జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వాహన డ్రైవ్ నిర్వహించి, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, లైసెన్సు, ఇన్సూరెన్స్, హెల్మెట్, నంబర్ ప్లేట్ మొదలగునవి లేకుండా నడిపే వాహనాలు స్వాధీన పరచుకుని, వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడకు పిలిపించడం జరిగింది.అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం, జరిమానాలు విధించడం మా ఉద్దేశం కాదు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే విధంగా చూడడమే మా ప్రధాన ఉద్దేశం.మోటార్ వాహనాల నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది.అవిఉల్లంఘనల వివరాలు:మైనర్ డ్రైవింగ్ – 164 (సీజ్: 80, జరిమానా: 84) ట్రిపుల్ రైడింగ్ – 36 (సీజ్: 18, జరిమానా: 36)లైసెన్స్ లేని వాహనాలు – 358 (సీజ్: 48,జరిమానా: 310) నంబర్ ప్లేట్ లేని వాహనాలు – 96 (సీజ్: 47, జరిమానా: 49) డ్రంక్ అండ్ డ్రైవ్ – 1 (సీజ్: 1)అనధికార పార్కింగ్ – 169 (సీజ్: 12, జరిమానా: 157)  రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయి: తమ భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించడం ఇతరుల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించడం. రోడ్లపై ప్రయాణించే సమయంలో మోటార్ వాహనాల చట్టాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి కర్తవ్యము.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం ప్రభుత్వాలు దీర్ఘకాల పరిశీలన తర్వాత ఈ నిబంధనలు అమలు చేస్తున్నాయి. మనం జాగ్రత్తగా వాహనం నడిపినప్పటికీ, ఇతరుల నిర్లక్ష్యం వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత అవసరం. డ్రైవింగ్ లైసెన్స్: వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హతను నిర్ధారించే పత్రం డ్రైవింగ్ లైసెన్స్.సరైన శిక్షణ లేకుండా వాహనం నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. అందువల్ల ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ సదుపాయం కూడా లభిస్తుంది.మైనర్ డ్రైవింగ్:మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధం మాత్రమే కాకుండా ప్రమాదకరం కూడా తల్లిదండ్రులు ప్రేమతో వాహనాలు ఇచ్చినా, అది పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది.మైనర్లలో నిర్ణయ సామర్థ్యం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.హెల్మెట్ వినియోగం
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. రోడ్డు ప్రమాదాల్లో తల గాయాలు మరణాలకు ప్రధాన కారణంగా గుర్తించబడ్డాయి.హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు.జరిమానా భయం వల్ల కాకుండా, వ్యక్తిగత భద్రత కోసం హెల్మెట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం:ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఖచ్చితంగా పాటించడం అవసరం. రెడ్ సిగ్నల్ వద్ద వాహనాలను ఆపకపోతే లేదా స్టాప్ లైన్ దాటితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ నిబంధనల అమలుకు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది.ఇన్సూరెన్స్ అవసరం:రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల గాయపడిన వారికి వైద్య సహాయం,మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుంది.కాబట్టి ప్రతి వాహనదారుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి.అవగాహన సదస్సు ఉద్దేశం:ఈరోజు నిర్వహించిన కౌన్సెలింగ్/అవగాహన కార్యక్రమం ఉద్దేశం వాహనదారులను ఇబ్బంది పెట్టడం కాదు.ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం మరియు ప్రజలు సురక్షితంగా ప్రయాణించేలా చేయడం ప్రధాన లక్ష్యం. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబానికి కలిగే నష్టం పూడ్చలేనిది.ముఖ్యంగా కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, లైసెన్స్ కలిగి ఉండడం,ఇన్సూరెన్స్ చేయించుకోవడం మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి.జాగ్రత్తగా వాహనం నడిపినా,ఇతరుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు సంభవించవచ్చు.అలాంటి సందర్భాల్లో హెల్మెట్ మరియు ఇన్సూరెన్స్ ప్రాణాలను మరియు ఆర్థిక భద్రతను కాపాడగలవని గుర్తుంచుకోవాలి.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాసరావు గారు,ఈస్ట్ డిఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు,ఎస్బి డిఎస్పీ శ్రీనివాసులు గారు, ట్రాఫిక్ సీఐ అశోక్ గారు,సింగయ్య గారు,పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు గారు,లాలపేట సీఐ శివప్రసాద్ గారు,అరండల్ పేట సీఐ ఆరోగ్యరాజు గారు, నగరంపాలెం సీఐ సత్యనారాయణ గారు,RI శ్రీహరి రెడ్డి గారు,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.