📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాజధాని ప్రాంతంలో డీజిల్ దొంగల ముఠా అరెస్ట్: డీఎస్పీ మురళీకృష్ణ

రాజధాని ప్రాంతంలో డీజిల్ దొంగల ముఠా అరెస్ట్: డీఎస్పీ మురళీకృష్ణ

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్10)రాజధాని పరిసరాల్లో డీజిల్ దందా రట్టు రూ.25,750 నగదు, 700 లీటర్ల డీజిల్ స్వాధీనం ఇన్నోవా కారు స్వాధీనం తక్కువ ధరకు డీజిల్ విక్రయం ముసుగులో దొంగతనం – గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రివేళ లారీల నుంచి డీజిల్ చోరీ – ఇన్నోవా కారుతో గ్యాంగ్ గిరాకీకి డీజిల్ దొంగలపై పోలీసుల ఉక్కుపాదం – నగదు, వాహనం స్వాధీనం రాజధాని పరిసరాల్లో డీజిల్ దందా రట్టు 700 లీటర్ల డీజిల్ పట్టివేత డీజిల్ చోరీ చేసి రైతులకు అమ్మకం – ముఠా అరెస్ట్, డీఎస్పీ వెల్లడి.రాజధాని ప్రాంతంలో డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల వద్ద నుండి సుమారు 700 లీటర్ల డీజిల్, రూ.25,750 నగదు, ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి గ్రామీణ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన కలికొండ వెంకట్రావు ప్రధాన నిందితుడిగా ఉండి, తనపై ఉన్న పూర్వ కేసుల నేపథ్యంతో గ్యాంగ్‌ను నడిపిస్తూ డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఇతనిపై సుమారు 12 క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్ కేసు నమోదు కాగా, రౌడీ షీట్ కూడా ఉన్నట్లు తెలిపారు.ఈ ముఠాలో సభ్యులుగా ఉన్న నీలంశెట్టి నాగరాజు, మేకల సాయి గణేష్, మేకల వెంకటేష్,మేకల వెంకటేష్ , అరుద్ర వీరబాబు లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.నిందితులు రాత్రి వేళల్లో రోడ్లపై నిలిపి ఉంచిన లారీలు, యంత్రాల నుండి డీజిల్ దొంగిలించి, లీటరుకు రూ.70 నుండి రూ.80 వరకు తక్కువ ధరకు అమాయక రైతులకు విక్రయిస్తున్నారని విచారణలో వెల్లడైంది. అమరావతి, మంగళగిరి మండలం, కురగల్లు, నవులూరు, టోల్ గేట్లు, డాన్ బాస్కో పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఈ దొంగతనాలు కొనసాగుతున్నట్లు గుర్తించారు.మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు మేఘా, బీఎస్ఆర్, ఎంవీఆర్ కంపెనీలు మరియు నవులూరు వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో సుమారు 700 లీటర్ల డీజిల్ దొంగతనం చేసి, రెడ్డి నాగరాజు, బాజీ, వజ్జా శివయ్యలకు విక్రయించినట్లు తెలిపారు.ఏప్రిల్ 3 అర్ధరాత్రి కురగల్లు వద్ద పోలీసులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, నిందితులు ఇన్నోవా కారును వదిలి పారిపోయినట్లు తెలిపారు.అనంతరం నీరుకొండ గ్రామ శివారులో మంగళగిరి నిందితులను అదుపులోకి తీసుకొని, 9 డీజిల్ క్యాన్లు, నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు కలికొండ వెంకట్రావు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తక్కువ ధరకు డీజిల్ లేదా పెట్రోల్ కొనుగోలు చేయకుండా, అధికారిక పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని డీఎస్పీ మురళీకృష్ణ సూచించారు.. ఈ దర్యాప్తు అధికారులు మంగళగిరి గ్రామీణ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐలు చిరుమామిళ్ల వెంకట్,రవి తేజ, నవీన్ నాయక్, హెచ్‌సీలు శ్యామ్, రామలింగేశ్వరరావు, చలమారావు, పీసీలు సాగర్, సురేష్, బుజ్జి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.