📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వాఖ్యలు సిగ్గుచేటు.విద్యార్థులకి క్షమాపణలు చెప్పాలి. ఎస్ఎఫ్ఐ

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వాఖ్యలు సిగ్గుచేటు.విద్యార్థులకి క్షమాపణలు చెప్పాలి. ఎస్ఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి21)గరికపాటి నరసింహారావు పేద పిల్లలకు అందించే మథ్యాహ్నభోజన పథకంపై అహంకారపు అక్కసు వెళ్ళగక్కడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) కడప నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.వాఖ్యలను వెనక్కి తీసుకుని,క్షమాపణ చెప్పాలని శనివారం విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రవచనాల పేరుతో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అమానవీయం.పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని,చదువు “మిధ్య” అయిపోయిందని అనడం పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.మధ్యాహ్న భోజనం పిల్లలు బడికి వచ్చేందుకు,డ్రాపౌట్ తగ్గేందుకు దోహదపడిందని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి.విద్యార్థులను“శోభనం పెళ్లికొడుకు“తో పోల్చడం విద్యార్థి లోకాన్ని కించపరచడం. భారతదేశంలో 84% మంది తల్లులు,పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.కోడిగుడ్డును దానిని “గాడిద గుడ్డు“అని సంబోధించడం ఆకలిని కించపరచడం.విద్యార్థులకు భోజనం,పుస్తకాలు, యూనిఫాం అందించడం ప్రభుత్వ బాధ్యత.దానిని “బిచ్చం“అని పిలవడం సిగ్గుచేటు.గరికపాటి వ్యాఖ్యలు కనీస “విజ్ఞత లేనివి“,ఏనాడయిన కార్పోరేట్లకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీల గురించి మాట్లాడని గరికపాటు పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కటం దుర్మార్గం.గరికపాటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. పిల్లలను అవమానించిన గిరికపాటి నరసింహారవు క్షమాపణలు చెప్పాలి.ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ డిమాండ్ చేయడం జరిగింది లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.