📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అకాల వర్షం బీభత్సం..నేలకొరిగిన అరటి తోటలు

అకాల వర్షం బీభత్సం..నేలకొరిగిన అరటి తోటలు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి21)పోరుమామిళ్ల  కన్నీరు మున్నీరవుతున్న  రైతులు రాత్రనకాపగలనకా రక్తాన్ని చెమట మార్చి ఆరుగాలంకష్టించిసాగు చేసిన అరటిపంటలు తీరా చేతికొచ్చే సమయంలో అకాలవర్షాలు,గాలివానకు నేలపాలు కావడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చేస్తున్నారు.కడపజిల్లాకాశినాయన,బ్రహ్మంగారి మఠం మండలాల్లోని అమగంపల్లి, ముడుమాలగ్రామపంచాయతీల్లోఅరటిపంటసాగుచేశారు.ఈసాగుకుఎకరానికి లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు,పంట కోతకు వచ్చే సమయంల ప్రకృతిప్రకోపానికిఅంతానాశనమైందని రైతులు శ్రీరాములు,దేవరాజు,కల్పన కన్నీటి పర్యంతమయ్యారు.అకాల వర్షం వల్లఅరటి చెట్లువిరిగి పోయి,కాయలన్నీ నెలపాలై కోలు కోలేని విధంగా నష్టం వాటిల్లిందని వారుఆవేదనవ్యక్తంచేశారు.”కష్టపడి పెంచిన పంట కళ్లముందేనేలపా లవ్వడం చాలా బాధాకరంగాఉంద న్నారు.ప్రభుత్వం వెంటనే స్పందిం చి క్షేత్రస్థాయిలో నష్టపరిహారాన్ని అంచనా వేసి,బాధితులను ఆదుకో వాలిని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.