📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం పి డి యస్ యు జిల్లా అధ్యక్షులు...

భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం పి డి యస్ యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి23)రాజంపేట జాతీయ ఉద్యమ నాయకులు కామ్రేడ్ భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్ ల 95వ వర్ధంతి సభ రాజంపేట పట్టణంలోనే గీతాంజలి డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పి డి ఎస్ యు) ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ,స్వతంత్రం కోసం ఎంతోమంది విద్యార్థులు,యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు.వారిలో అగ్ర గన్యలు కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజగురు,సుఖదేవ్ లు అని కొనియాడారు.సామ్రాజ్యవాదుల ఆదిపత్యం పీకి పారేయాలి అంటే భారతదేశంలో ఒకే ఒక ఆయుధం అది శ్రామిక వర్గ విప్లవమని భగత్ సింగ్ వందేళ్ళ క్రితమే చెప్పాడు.1931 మార్చి 23న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వీరు ముగ్గురుని క్రూరంగా ఉరి తీసారు. మాతృదేశ విముక్తి కోసం ఎన్ని సారులు అయినా ఉరితాలను పూలమాలుగా స్వీకరిస్తానని కామ్రేడ్ భగత్ సింగ్ ధైర్యంగా ప్రకటించాడని పిడియస్ యూ జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వర తెలిపారు.సామ్రాజ్యవాద వ్యతిరేకత నిజమైన దేశభక్తి ఆని ఆనాడు భగత్ సింగ్ నినదించాడు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశాన్ని దోచుకుంటే నేడు అమెరికా సామ్రాజ్యవాదం భారత్ తో సహా ప్రపంచ దేశాల్ని దోచుకుంటుంది. భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించడం అంటే భగత్ సింగ్ కలల కన్నా నూతన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడమే. చమురు సంపద దురాక్రమణకై ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కబంధహస్తాలకు తాకట్టు పెట్టే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాల్లో నిరసిస్తూ సమరశీల ఉద్యమాలు భగత్ సింగ్ స్ఫూర్తితో నిర్మించాలని అన్నారు.రాజంపేట గీతాంజలి విద్యాసంస్థల అధినేత ఎస్వి రమణ మరియు కళాశాల ప్రిన్సిపాల్ సంభవు చలపతి మాట్లాడుతూ భగత్ సింగ్ 23 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచాన్ని కదిలించాడని అతనికి పెద్ద పదవి లేదు, అధికారము లేదు,సంపద లేదు.కానీ ఒక ఆలోచన ఉంది,“దేశం కోసం జీవించాలి,అవసరమైతే మరణించాలి.”నేటి యువతలో కూడా అదే శక్తి ఉంది కానీ ఆ శక్తి సరైన దిశలో ఉపయోగించాలి అని వారు విద్యార్థులకు తెలియజేశారు సోషల్ మీడియా లో వాదనలు చేయడం కంటే,సమాజంలో మార్పు తీసుకురావడం ముఖ్యమైంది. చదువుకున్న యువత ప్రజా సమస్యలపై ముందుకు రావాలి.గ్రామంలో సమస్య ఉంటే యువకులు మాట్లాడాలి.పేదవాడికి న్యాయం జరగకపోతే యువత నిలబడాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా నాయకులు నితిన్ కుమార్,దీపిక అన్నపూర్ణ పుష్పాంజలి వర్షిత సాగర్ చైతన్య శివ పృథ్వి హేమంత్ సాయి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.