📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమం..

ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, మార్చి 10, ప్రజావాణి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కే. హేమావతి తెలిపారు. జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ఈనెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సర్పంచులకు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్ లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6 నుండి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ లకు జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తేదీ నాడు శిక్షణ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులను అందరిని ఆహ్వానించి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 అంశాల వారీగా నిర్వహించాల్సిన పనులతో పాటు 99 రోజుల కార్యచరణ ప్రణాళిక పై రోజు మొత్తం రెండు సెషన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, గ్రామాలలో మరియు మున్సిపాలిటీలలో వాటి అమలులో నూతనంగా ఎంపికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోషించాల్సిన పాత్ర పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తామని, వారి సందేహాలను ఆయా శాఖల ద్వారా నివృత్తి చేస్తామని సిఎస్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిపిఓ దశరథ్, జిల్లా అటవీశాఖ అధికారి, డిఆర్డిఓ, డిపిఓ, అదనపు డీసీపీ, డీఈవో, డిడబ్ల్యుఓ, డిఎం అండ్ హెచ్ఓ, డిఏఓ తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.