📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపీహెచ్‌సీలను బలోపేతం చేయాలి: నల్లు సుధాకర్ రెడ్డి

పీహెచ్‌సీలను బలోపేతం చేయాలి: నల్లు సుధాకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పీహెచ్‌సీలను బలోపేతం చేయాలి: నల్లు సుధాకర్ రెడ్డి
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, అక్టోబర్ 29 ప్రజావాణి:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి సామాన్య ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలందించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు
కొరివి,బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిపిఐ బృందం సందర్శించి డాక్టర్ మౌనిక, డాక్టర్ స్రవంతి లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కురవి కేంద్రంలో గదుల కొరత, స్కావెంజర్ లేకపోవడం, త్రాగునీటి సౌకర్యం అంతంత మాత్రమే ఉండటం,బలపాల కేంద్రంలో షుగర్,బి పీ,గోలీలు గత రెండు నెలలుగా సరఫరా చేయకపోవడంతో రోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ల్యాబ్ కు సంబంధించిన రసాయనాలు సరిపడా లేకపోవడం,ఇద్దరు డాక్టర్లను కేటాయించినప్పటికీ ఒక డాక్టర్ డిప్యూటేషన్ పై ఇతర కేంద్రానికి వెళ్లిపోవడం, ఆసుపత్రిని 12 గంటల నడిపించడం వలన జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనికాబట్టి 24/7 ఆసుపత్రి నడిపించి కావలసిన సిబ్బందిని, మందులను సమకూర్చాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరరావు,మండల కన్వీనర్ బుడమ వెంకన్న,మండల సహాయ కార్యదర్శి బుర్ర సమ్మయ్య, కొరివి పట్టణ కార్యదర్శి తుర్క రమేష్, కన్నె వెంకన్న, దూదికట్ల సారయ్య, కలగూర నాగరాజు, రామగోని రవి, బొడ్డు ఉదయ్, వెంకటేశ్వర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.