హస్తాన్ని విడి ప్రతిపక్ష పార్టీలోకి వేముల అరుణ్
రామగిరి మండలం సుందిల్ల గ్రామం విద్యానగర్‌కు చెందిన యువజన నాయకుడు వేముల అరుణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.సుందిళ్ల గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు బోగిరి భాస్కర్ ఆధ్వర్యంలో ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. యువతకు బీఆర్ఎస్ సిద్ధాంతాలు,పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఆకర్షణీయంగా మారుతున్నాయని పేర్కొన్నారు.వేముల అరుణ్ వంటి యువ నాయకుడి చేరికతో గ్రామంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.పార్టీలో చేరిన అనంతరం వేముల అరుణ్ మాట్లాడుతూ…ప్రజా సంక్షేమం,గ్రామాభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తానని తెలిపారు.పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేముల అరుణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
హస్తాన్ని విడి ప్రతిపక్ష పార్టీలోకి వేముల అరుణ్
RELATED ARTICLES




