📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జాడి యుగేందర్ గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు .మంత్రి సీతక్క

జాడి యుగేందర్ గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు .మంత్రి సీతక్క

📰 Generate e-Paper Clip

జాడి యుగేందర్ గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
.మంత్రి సీతక్క
గోవిందరావుపేట (తెలంగాణ ప్రజావాణి)

గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాడి యుగేందర్
గారు అనారోగ్యంతో కన్నుమూయడం తీవ్ర విషాదం కలిగించింది.

వారి చిత్రపటానికి *రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క* గారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ జాడి యుగేందర్ గారు పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు.

పార్టీ సిద్ధాంతాల పట్ల వారి విశ్వాసం, ప్రజల పట్ల సేవాభావం ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.

యుగేందర్ గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారి సేవలు పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిలక్షమ తాయని అన్నారు. క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జాడి యుగేందర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణి, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ తో పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మి కాంత్ ములుగు*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular